శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు..ఈ పేర్లు చాలా మంది వినకపోవొచ్చు.

శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు..ఈ పేర్లు చాలా మంది వినకపోవొచ్చు. శీతాకాలపు నెలల మధ్య వస్తాయి కాబట్టి దీనిని శిశిర నవరాత్రి అని కూడా అంటారు. దేవీ నవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు. నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వీయజ మాసంలో జరుపుకుంటారు. దీనిని ప్రతీక్ష నవరాత్రి అని పిలుస్తారు. మరో రెండు సార్లు నవరాత్రిని ఆషాడ మరియు మాఘ మాసములలో జరుపుకుంటారు. దీనిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి లేదా ఆషాఢంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామల నవరాత్రులని పిలుస్తారు.

దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

2025లో, గుప్త నవరాత్రులు ఈ రోజు (30) గురువారం నుంచి ,ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం ముగుస్తాయి. ఈ నవరాత్రి మాఘ శుక్ల పక్షం యొక్క ప్రతిపద నుండి నవమి రోజు వరకు ఆచరిస్తారు. గుప్త నవరాత్రులలో, పది మహావిద్యల పూజలు నిర్వహిస్తారు.శక్తి ఆరాధనకు ఈ తొమ్మిరోజులు రహస్య మార్గంలో సాధన చేస్తారు..అందుకే గుప్త నవరాత్రులు అనే పేరువచ్చింది. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో పూజించినట్టే...శ్యామల నవరాత్రుల్లో కూడా దుర్గమ్మని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు..

మాఘ గుప్త నవరాత్రి పండుగ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఘనంగా జరుపుకుంటారు.

Updated On 30 Jan 2025 4:57 AM GMT
ehatv

ehatv

Next Story