TS Elections Betting : తెలంగాణ ఫలితాలపై కోట్లల్లో బెట్టింగ్‌ల దందా !
తెలంగాణ ఎన్నికలను(Telangana Elections) అధికార, విపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని(Election Campaign) నిర్వహించాయి. నెల రోజులపాటు నువ్వా-నేనా అన్నట్టు సాగిన ప్రచార పర్వం ముగియడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల గెలుపోటములపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో మొన్నటి వరకు ఐపీఎల్, ఆ తర్వాత ప్రపంచ కప్ క్రికెట్(Cricket) పై బెట్టింగ్(Betting) కాసిన పందెంరాయుళ్ల దృష్టి..ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై పడింది.

తెలంగాణలో ఒకే దశలో రేపు పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న మిగతా నాలుగు రాష్ట్రాలతో కలిపి..అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజా కాయ్ అంటూ ఆయా పార్టీల విజయాలపై జోరుగా పందాలు కాస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను(Parliament Elections) ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికల గురించి ప్రజలు చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇక తెలంగాణ ఎన్నికలపై ఇప్పటికే అనేక సర్వేలు(Survey)..పలు విధాలుగా తమ అభిప్రాయం చెప్పడంతో పార్టీల గెలుపోటములపై మరింత ఉత్కంఠరేపుతోంది. ఇదే అదనుగా తెలంగాణ ఎన్నికలపై బుకీలు బెట్టింగ్ దందాను మొదలు పెట్టారు. ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలకుపైగా దాందా జరిగినట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 30 పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ మొదలుకొని..డిసెంబర్ 3వ తేదీ వరకు బెట్టింగ్ దందా 10వేల కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే ఏపీలో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు వెయ్యికోట్ల రూపాయల దందా జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. హైదరాబాద్ లేదా తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఏపీ(AP), ముంబై(Mumbai), ఢిల్లీ(Delhi), కోల్‌కతతో(Kolkata) పాటు దేశంలోని పలు ఇతర నగరాల్లో దందా సాగిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు లండన్, అమెరికాల నుంచి యాప్‌ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరిగింతవరకు బెట్టింగులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.