మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతానికైతే కాంగ్రెస్‌ (Congress) గెలిచే అవకాశాలున్నాయన్నది వివిధ సర్వేల సారాంశం. బీజేపీ కంటే పది, పదిహేను సీట్లు ఎక్కువ రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ గెలుపు కోసం కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ (EX CM Kamal Nath) తన గెలుపుకోసం తాంత్రికపూజలు చేయిస్తున్నారట! సోషల్‌ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఉజ్జయినిలోని ఓ స్మశానంలో కమల్‌నాథ్‌ ఫోటో ఎదురుగా పెట్టుకుని ఓ తాంత్రికుడు నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్టుగా […]

మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతానికైతే కాంగ్రెస్‌ (Congress) గెలిచే అవకాశాలున్నాయన్నది వివిధ సర్వేల సారాంశం. బీజేపీ కంటే పది, పదిహేను సీట్లు ఎక్కువ రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ గెలుపు కోసం కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ (EX CM Kamal Nath) తన గెలుపుకోసం తాంత్రికపూజలు చేయిస్తున్నారట! సోషల్‌ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఉజ్జయినిలోని ఓ స్మశానంలో కమల్‌నాథ్‌ ఫోటో ఎదురుగా పెట్టుకుని ఓ తాంత్రికుడు నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్టుగా సోషల్‌ మీడియాలో ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రి అవ్వాలనే ఈ పూజలు చేయిస్తున్నట్టు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్‌ చెప్పడం సంచలనంగా మారింది. బీజేపీకి ఇది ఎన్నికల ఆయుధంగా మారింది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దీనిపై ఘాటుగా స్పందించారు. 'ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వాలనుకుంటే, దానిని స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా నిర్వహించుకోవాలి. అంతేకానీ, ఇలా క్షుద్రపూజలు చేయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’ అని చౌహాన్‌ అన్నారు. ‘మేం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేయాలి. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, వారికి సేవ చేయడానికి ఇదే మార్గం. కొందరు మాత్రం స్మశానవాటికలో తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగముందా?’ అని చౌహాన్‌ ప్రశ్నించారు.

Updated On 21 Oct 2023 6:16 AM GMT
bodapati ashok

bodapati ashok

Next Story