హైదరాబాద్: మధురానగర్‌(Madhura nagar), ఇంజినీర్స్‌కాలనీలోని ఫ్రిడ్జ్‌ రెసిడెన్సీలో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్పించే రవికుమార్‌(Ravi kumar) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో బలంగా బాది చంపేశాడు(Murder). రవికుమార్‌ తలపై చితకబాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరక్కుండా కారంపొడి, పసుపు చల్లి పారిపోయాడు.

హైదరాబాద్: మధురానగర్‌(Madhura nagar), ఇంజినీర్స్‌కాలనీలోని ఫ్రిడ్జ్‌ రెసిడెన్సీలో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్పించే రవికుమార్‌(Ravi kumar) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో బలంగా బాది చంపేశాడు(Murder). రవికుమార్‌ తలపై చితకబాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరక్కుండా కారంపొడి, పసుపు చల్లి పారిపోయాడు. నిందితుడు అపార్ట్‌మెంట్‌లోకి రావడం, వెళ్లే దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో కనిపించాయి. అయితే నిందితుడు మాస్క్, క్యాప్‌ ధరించి ఉండడంతో గుర్తించలేకపోయారు పోలీసులు. బుధవారం సా.4 గంటలకు రవికుమార్ భార్య తన కూతురిని తీసుకొని పార్క్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి రవికుమార్‌ రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆధారాలు సేకరించారు. రవికుమార్ భార్య, ఇరుగుపొరుగు ఉన్నవారి వివరాలు తెలుసుకున్నారు. రవికుమార్‌ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌కు డైరెక్ట్‌గా ఎలా వచ్చాడు, ఆ సమయంలో వాచ్‌మన్ ఉన్నాడా లేదా అని విచారిస్తున్నారు. తలపై రాడ్డుతో బలంగా కొట్టడంతోనే రవికుమారు అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి స్వస్థలం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంగా గుర్తించారు. భార్య, కూతురితో కలిసి ఫ్రిడ్జ్‌ రెసిడెన్సీలో గత కొంత కాలంగా అద్దెకు ఉంటున్నారు రవికుమార్. పట్టపగలే రవికుమార్‌ హత్యతో అపార్ట్‌మెంట్‌ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.

Updated On 9 May 2024 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story