అతడు మామూలోడు కాదు.. ఇద్దరు యువతులను మోసం చేసి మూడో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసి పోలీసులు అతగాడిని అరెస్ట్ చేశారు. తర్వాత జరిగిన పరిణామాలే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సదరు వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ యువతులు పెట్టిన కేసు పోలీసులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ చిత్రవిచిత్రమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో(Madhura Nagar Police Station) చోటు చేసుకుంది.

అసలు జరిగిందేమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్(Baba Fakhruddin) అనే యువకుడు మాదాపూర్‌లోని(Madhapur) ఓ హాస్పిటల్‌లో పని చేసేవాడు. అదే ఆసుపత్రిలో పనిచేసే యువతితో రెండేళ్ల కిందట పరిచయం ఏర్పరచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాటిచ్చాడు. వెంగళరావునగర్ డివిజన్‌లోని ఓ బస్తీలో ఉంటున్న ఆ అమ్మాయి గదికి అనేకసార్లు వచ్చి తన కోరికలను తీర్చుకున్నాడు.
కొంతకాలం తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఖానాలోని మరో హాస్పిటల్‌లో ఉద్యోగానికి చేరాడు. అక్కడ పని చేసే యువతిని ప్రేమలో దించాడు. ఆమెతో కూడా తన కోర్కెలు తీర్చుకున్నాడు. ఈ నెల 6వ తేదీన ఈమెకు చెప్పకుండా తన స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటిపక్కనే ఉంటున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ నెల 24న ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలనుకున్నాడు. ఉంగరాలు, దండలు మార్చుకునే సమయానికి మధురానగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఇక్బాల్(Iqbal) ఎంటరయ్యారు.
ఇన్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు నిశ్చితార్థాన్ని అడ్డుకున్నారు. ఫక్రుద్దీన్‌ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియక బంధుమిత్రులు తెల్లమోహం వేశారు. వారికి పోలీసులు ఫక్రుద్దీన్ గతం మొత్తం చెప్పి అతడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అంతటితో సమస్య పరిష్కారం అయ్యిందని పోలీసులు అనుకున్నారు. కానీ ఇక్కడే కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఫక్రుద్దీన్‌ను పోలీస్‌స్టేషన్కు తీసుకొచ్చారని తెలుసుకున్న బాధిత యువతులిద్దరూ రాత్రి స్టేషన్‌కు వచ్చారు.
అర్ధరాత్రి వరకు వాడు నా వాడంటే, కాదు నా వాడంటూ దెబ్బలాడుకున్నారు. పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. ముందుగా నేను మోసపోయాను కాబట్టి వాడు నాకే సొంతమంటూ వాదనకు దిగింది మొదటి యువతి. నేను కూడా సర్వస్వం అతడికి అర్పించాను కాబట్టి వాడు నాకే దక్కాలి అని దెబ్బలాడింది రెండో యువతి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో పోలీసులకు అర్థంకాలేదు. చివరకు ఫక్రుద్దీన్‌ను రిమాండ్‌కు పంపించి ఊపిరిపీల్చుకున్నారు పోలీసులు.