Madhu Yaskhi Goud : నా ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో నువ్వే చూపించు..!
మాజీమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలపై టీపీసీసీ క్యాంపెయినింగ్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఫైరయ్యారు
మాజీమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలపై టీపీసీసీ క్యాంపెయినింగ్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఫైరయ్యారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. వారానికి నాలుగు సార్లు వెళ్లి ఎంజాయ్ చేయడానికి నీకు జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది.. నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్..! అంటూ కౌంటరిచ్చారు. 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించిన నీవు.. ఆ ఫామ్ హౌస్ ను బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తున్నావ్.. నీలాగా నాకు అలా విలాసవంతమైన ఫామ్ హౌస్ లు లేవు కేటీఆర్.. నేను ప్రజల్లో ఉండేటోన్ని.. అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తానని అన్నారు.
మాకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్న మాట వాస్తవం.. అక్కడ వాచ్ మెన్ కుటుంబం ఉండడం కోసం పాతబడిన చిన్న నిర్మాణం తప్పా.. ఫామ్ హౌస్ లేదన్నారు. అయినా ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో వ్యవసాయం, తోటల పెంపకం చేయొచ్చు అనే కనీస అవగాహన నీకు లేనట్లుంది.. కానీ నాకు ఫామ్ హౌస్ ఉన్నట్లు.. అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నట్లు కేటీఆర్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించడం సిగ్గుచేటు అన్నారు. నాకు ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో.. ఎంత విలాసంగా నిర్మించుకున్నానో కేటీఆరే చూపించాలన్నారు. అబద్దాలు, చిల్లర మాటలు మాట్లాడడం ఇకనైనా మానుకో కేటీఆర్..! అని హితువు పలికారు.