హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవి లత
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవి లతను శివంగి అని పిలిచారు భారతీయ జనతా పార్టీ నాయకురాలు నవనీత్ రాణా. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌గా మార్చకుండా మాధవీలత అడ్డుకుని అభివృద్ధికి పడతారని అన్నారు. మాధవి లత శివంగిలా పోరాడుతూ ఉన్నారని.. కాంగ్రెస్ కూడా AIMIMకి మద్దతివ్వడానికి డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు. ఒవైసీ వేరే చోట నుండి పోటీ చేసి అసలు బలం ఏమిటో చూపించాలని అన్నారు. దేశ ప్రజలు AIMIM మరియు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, అది నేరుగా పాకిస్తాన్‌కు వెళుతుందని అన్నారు.
మీరు AIMIM, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, అది నేరుగా పాకిస్తాన్‌కు వెళుతుందని.. మోదీని ఓడించి రాహుల్‌ని గెలిపించేలా పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అన్నారు నవనీత్ రాణా. నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రూపంలో మాధవి లత ఒక బలీయమైన ప్రత్యర్థితో పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ఇదే తొలిసారి.