హైదరాబాద్‌లో మెట్రో(Hyderabad Metro) అందుబాటులోకి వచ్చిన తర్వాత దూర ప్రయాణాలకు సులభతరమైంది. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే హాయిగా ఏసీ మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో ఉంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం, జేబీఎస్ నుంచి ఎంబీబీఎస్ మార్గాల్లో మెట్రో ప్రయాణం కొనసాగుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి ఇది ఎంతో కలిసి వస్తుంది. ట్రాఫిక్ సమస్య లేకుండా.. ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు. వర్షం పడినా.. ఇతరాత్ర ఎలాంటి సమస్యలు వచ్చినా.. మెట్రో అందుబాటులో ఉండటం వల్ల అర్థరాత్రి సమయంలో వరకు కూడా ఎంతో సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం లభించింది. అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం(Free Bus) వల్ల మెట్రో నష్టపోతుందని స్వయంగా ఎల్ అండ్ టీ సంస్థే తెలిపింది.

ఈ క్రమంలోనే మెట్రో ప్రయాణికులకు కొంత భారమైన వార్తలే వస్తున్నాయి. త్వరలోనే మెట్రో చార్జీలు(Metro charges) పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మెట్రో ప్రారంభమైన సమయంలో ఉన్న ధరలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఒకసారి మెట్రో ఛార్జీలు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు. అందుకే అన్ని అంశాలను బేరీజు వేసుకొని ఛార్జీల ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం. ప్రతీ నెలా రూ.45 కోట్ల చొప్పున ఏడాదికి రూ.540 కోట్ల నష్టం వస్తున్నట్లు ఎల్ అండ్ టీ చెప్తోంది. ఈ మధ్యనే ఎల్ అండ్ టీ తన ఆధీనంలో ఉన్న మెట్రోను విక్రయిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనిపై సీఎం రేవంత్ కూడా స్పందిస్తూ 'అమ్ముకుంటే అమ్ముకోమనండి మాకేం అభ్యంతరం' అని వ్యాఖ్యానించారు. ఇక చేసేదేమీ లేక నష్టాలు పూడ్చుకునేందుకు ప్రయాణికులపై కొంత భారం వేయాలని భావిస్తోందట. ప్రస్తుతం మెట్రో టికెట్ ధర కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు ఉంది. మెట్రో ప్రారంభమై ఆరేళ్లు కావొస్తున్నా ప్రారంభ ధరలే ఇంకా అమలులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ధరలను 5-10 శాతం వరకు పెంచాలని ఎల్ అండ్ టీ సంస్థ కసరత్తు చేస్తుంది. కనిష్ట ధర రూ.20 నుంచి గరిష్ట ధర రూ.80 వరకు పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.