ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే!! అయితే ఈ ఓటమి తమ మంచికే అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు స్వయానా కేటీఆర్. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి కూడా మంచికే జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ను మడతపెట్టి కొట్టుడే అని అన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమావేశంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్‌ […]

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే!! అయితే ఈ ఓటమి తమ మంచికే అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు స్వయానా కేటీఆర్. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి కూడా మంచికే జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ను మడతపెట్టి కొట్టుడే అని అన్నారు.

ఉప్పల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమావేశంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో​ మాల్కాజ్‌గిరిలో గెలుపు తమదేనన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు ప్రజలకు అర్థమయ్యాయి. కాంగ్రెస్‌ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్‌ అని, చేతల ప్రభుత్వం కాదని తెలుసుకున్నారని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెట్టుడేనని వార్నింగ్ కూడా ఇచ్చారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారన్నారు. రేవంత్‌లాగా మేము కూడా తిట్టగలం. కానీ, మాకు సభ్యత ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్నానన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated On 4 Feb 2024 4:57 AM GMT
Yagnik

Yagnik

Next Story