మోసపోయేవారున్నంత వరకు మోసగాళ్లు చెలరేగుతూనే ఉంటారు. ప్రజల అమాయకత్వంతో ఆటలాడుకుంటూనే ఉంటారు. జనగామ(Janagam) పట్టణంలో ఇలాగే వ్యక్తి మోసగాళ్ల చేతుల్లోంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని జనగామ పట్టణ పోలీసుస్టేషన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐలు సృజన్, శ్వేతలు వివరంగా చెప్పుకొచ్చారు.
మోసపోయేవారున్నంత వరకు మోసగాళ్లు చెలరేగుతూనే ఉంటారు. ప్రజల అమాయకత్వంతో ఆటలాడుకుంటూనే ఉంటారు. జనగామ(Janagam) పట్టణంలో ఇలాగే వ్యక్తి మోసగాళ్ల చేతుల్లోంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని జనగామ పట్టణ పోలీసుస్టేషన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐలు సృజన్, శ్వేతలు వివరంగా చెప్పుకొచ్చారు. నాగర్‌కర్నూల్(Nagar kurnool) జిల్లా ఆమ్రాబాద్ మండలం మున్ననూర్‌కు చెందిన లారీ డ్రైవర్ కేతావత్ శంకర్(Ketawat Shankar), నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంఘంబండకు చెందిన చికెన్ వ్యాపారి ఖాసీం, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఎలక్ట్రిషియన్ మహ్మద్ అజహర్, నల్లగొండ జిల్లా దిండి మండలం దేవత్‌తల్లి తండాకు చెందిన కొర్ర గాసిరాంలు ఓ జట్టుగా ఏర్పడ్డారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ బంజారా కాలనీలో ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశారు. మోసాలతోనే సునాయసంగా డబ్బు సంపాదించవచ్చని అనుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆకాశం నుంచి భూమ్మీదకు జారిన ఈ పెట్టెను కొన్నవారు కోటీశ్వరులు అవుతారని చెప్పసాగారు. 50 కోట్లకు పెట్టెను వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తికి అమ్ముదామనుకున్నారు. పెట్టెను తీసుకుని హైదరాబాద్ నుంచి వరంగల్ బయలుదేరారు. దారిలో జనగామ మండలం పెంబర్తి వై జంక్షన్ వద్ద ఎస్సై సృజన్, పీసీ బి.కర్ణాకర్, టి.రామన్న వెహికిల్స్ చెక్ చేస్తున్నారు. వారిని చూసి భయపడ్డ నిందితులు తమ వాహనాన్ని వెనుకకు తిప్పే క్రమంలో పట్టుపడ్డారు. వారి నుంచి పెట్టె, వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపించారు.