లోక్‌సభ(Lok Sabha) కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను సోమవారం 34 మంది విపక్ష ఎంపీలను(MP) సభ నుంచి సస్పెండ్(Suspend) చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్(Congresss) నేత అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan choudhary), డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, దయానిధి మారన్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌగత రాయ్ ఉన్నారు.

సస్పెండ్ అయిన ఎంపీల్లో 31 మందిని మిగిలిన శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా(Om Birla) తెలిపారు. ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకూ మరో ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. స్పీకర్ కుర్చీపైకి ఎక్కి నినాదాలు చేసిన ఆ ముగ్గురు కె. జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలిక్ గా పేర్కొన్నారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సస్పెన్షన్‌కు సంబంధించిన ప్రతిపాదనను స్పీకర్‌కు సమర్పించారు. అనంతరం వాయిస్ ఓటుతో ఆమోదించారు. అనంతరం సభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి.
లోక్ సభలో టియర్ గ్యాస్ వదిలి తీవ్ర కలకలం సృష్టించడం తెలిసిందే. హై సెక్యూరిటీ ఉండే పార్లమెంటులోకి కొత్త వాళ్లు ఎలా ప్రవేశించారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంటులో ఎంపీల భద్రత ఒట్టి డొల్ల అని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలు లోక్ సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ కూడా భద్రతా వైఫల్యం అంశంపై లోక్ సభ దద్దరిల్లింది. ఈ క్రమంలోనే సభ్యుల సస్పెన్షన్ నిర్ణయం వెలువడింది.