తెలంగాణ(Telangana)లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి భారీ షాక్ తప్పదా? మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న గులాబీ బాస్.. ఈసారి గద్దె దిగాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి వరుస సర్వేలు. ప్రఖ్యాత సర్వే సంస్థ లోక్ పోల్ (LOK POLL Survey )తాజాగా నిర్వహించిన సర్వే.. తెలంగాణలో ప్రస్తుతం సంచలనం రేపుతోంది.

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేసిన లోక్ పోల్ సర్వే

తెలంగాణ(Telangana)లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి భారీ షాక్ తప్పదా? మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న గులాబీ బాస్.. ఈసారి గద్దె దిగాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి వరుస సర్వేలు. ప్రఖ్యాత సర్వే సంస్థ లోక్ పోల్ (LOK POLL Survey )తాజాగా నిర్వహించిన సర్వే.. తెలంగాణలో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో(Assembly Elections) కాంగ్రెస్ పార్టీ (Congress Party)ఘన విజయం సాధించబోతోందని తేల్చింది.

తెలంగాణలోని మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ కు 61 నుంచి 67 సీట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీ 45 నుంచి 51 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలుస్తుందని తెలిపింది. ఎంఐఎం పార్టీకి 6 నుంచి 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక బీజేపీ 2 నుంచి 3 స్థానాలకే పరిమితమవుతుందని, ఇతరులు సున్నా లేదా ఒక్క స్థానాన్ని గెలుచుకోవచ్చని లోక్ పోల్ సర్వే తేల్చింది. ఓట్ షేరింగ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 41-44% ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 39-42 % , బీజేపీకి 10-12% ఓట్లు,ఎంఐఎం 3-4%, ఇతరులకు 3-5% ఓట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ తమ ఓటు బ్యాంకును భారీగా కోల్పోతుందని, ఓల్డ్ సిటీలో ఎంఐఎం యధావిధిగా తమ పట్టు నిలుపుకుంటుందని వెల్లడించింది. నిజామాబాద్, మెదక్ లోకసభ స్థానాల్లో బీఆర్ఎస్ పట్టునిలుపుకోనుండగా.. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్, నల్గొండ, జహీరాబాద్ లోక్ సభ స్థానాల పరిధిలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్సే దక్కించుకునే అవకాశముందని లోక్ పోల్ వెల్లడించింది.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పూర్తిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని లోక్ పోల్ అభిప్రాయపడింది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, స్థానిక నేతలపై అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పైన పెరుగుతున్న వ్యతిరేకత కాంగ్రెస్ విజయానికి దోహదపడతాయని తెలిపింది. అలాగే రైతులు, నిరుద్యోగుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సర్వే చెప్పింది. కాంగ్రెస్ సానుకూల అంశాల విషయానికి వస్తే.. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని సర్వేలో వెల్లడైంది. బీసీలు, మైనారిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోందని తెలిపింది.

ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఈ సర్వేను నిర్వహించినట్టు లోక్ పోల్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ సర్వే నిర్వహించినట్టు తెలిపింది. సర్వే శాంపిల్ సైజ్ 60 వేలు అని పేర్కొంది. లోక్ పోల్ సంస్థ సర్వే రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేసి లోక్ పోల్ సర్వే సంచలనం సృష్టించింది. కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీకి 129-134 స్థానాలు, బీజేపీకి 59-65 స్థానాలు వస్థాయని చెప్పగా.. దాదాపుగా అవే ఫలితాలు వచ్చాయి.

Updated On 6 Oct 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story