తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు షాక్ తగలనుంది. 30వ తేదీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైన్స్ లు, బార్లు మూసివేయాలని ఆబ్కారీ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Liquor shops will be closed for three days
తెలంగాణ ఎన్నికల(Telangana Elections) నేపథ్యంలో మందుబాబులకు షాక్ తగలనుంది. 30వ తేదీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైన్స్(Wines) లు, బార్లు(Bars) మూసివేయాలని ఆబ్కారీ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,279 వైన్ షాపులు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
ఈనెల 30వ తేదీన పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. తిరిగి డిసెంబర్ ఒకటో తారీఖున మద్యం షాపులు తెరుచుకుంటాయి. మూడు రోజులు వైన్ షాపులు బంద్ అవ్వనుండడంతో వైన్ షాపుల వద్ద అప్పుడే హడావుడి మొదలయ్యింది. కొన్నిచోట్ల వైన్ షాపు ఓనర్స్ నో స్టాక్(No Stock) బోర్డులు కూడా పేట్టేశారు.
