తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం(Election Campaign) మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 106 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది.
దీంతో సీఎం కేసీఆర్(CM KCR) గజ్వేల్(Gajwel)లో ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. మొదట వరంగల్ ఈస్ట్(Warangal East), వెస్ట్(West) అభ్యర్థుల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో ఎల్‌బీ కళాశాలకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కేఎంసీలోని మీటింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుని సభలో మాట్లాడతారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) ఈ రోజు కామారెడ్డి(Kamareddy), సిరిసిల్ల(Siricilla) నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కామారెడ్డి పట్టణంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్ల లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు.