అరిషడ్వర్గాలు మనిషిలో ఉంటే పతనం చెందుతాడని పెద్దలంటుంటారు. ఈ ఆరింటిలో కామం మహా ప్రమాదం. పరస్త్రీ ఆకర్షణకు లోనైతే ఇక అంతే సంగతులు. మహబూబ్‌నగర్‌లో(Mahaboobnagar) ఇదే జరిగింది. పైగా ఈ నేరకథనంలోని ప్రధాన పాత్రధారులంతా పోలీసు డిపార్ట్‌మెంట్‌కు(Police department) చెందిన వారు కావడం విశేషం.

అరిషడ్వర్గాలు మనిషిలో ఉంటే పతనం చెందుతాడని పెద్దలంటుంటారు. ఈ ఆరింటిలో కామం మహా ప్రమాదం. పరస్త్రీ ఆకర్షణకు లోనైతే ఇక అంతే సంగతులు. మహబూబ్‌నగర్‌లో(Mahaboobnagar) ఇదే జరిగింది. పైగా ఈ నేరకథనంలోని ప్రధాన పాత్రధారులంతా పోలీసు డిపార్ట్‌మెంట్‌కు(Police department) చెందిన వారు కావడం విశేషం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్‌(Lady constable) పన్నిన ఉచ్చులో సీసీఎస్‌ సీఐ(CCS CI) ఇఫ్తికార్‌ అహ్మద్‌(Iftikhar Ahmed) చిక్కుకున్నారు. ఆ మహిళా కానిస్టేబుల్‌ హని ట్రాప్ చేస్తున్నదని గ్రహించలేకపోయాడా ఎస్‌ఐ. ఆమె దగ్గర అడ్డంగా బుక్కయ్యారు. తాను వేసిన వలలో ఇఫ్తికార్‌ పడిన వెంటనే ఆమె తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టింది. ఇఫ్తికార్‌ను బ్లాక్‌మెయిల్‌(Blackmail) చేయడం మొదలుపెట్టింది. ఓ దశలో ఇఫ్తికార్‌ అహ్మద్‌ అడ్డం తిరిగారు. ఆ మహిళ కానిస్టేబుల్‌ బండారం బయటపెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తన భర్తతో కలిసి ఆయనను హత్య చేయడానికి ప్లాన్‌ వేసింది. అన్నట్టు ఆమె భర్త కూడా పోలీసే! ఇద్దరూ కలిసి బుధవారం అర్దరాత్రి ఆయనపై దాడికి దిగారు. ఆయన మర్మాంగాలను కోసేశారు. తలపై బలమైన ఆయుధాలతో దాడి చేశారు. ఇది గమనించిన స్థానిక పోలీసులు ఆయనను జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈఎస్‌ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. గతంలో కూడా మహిళ కానిస్టేబుల్‌ ఓ పోలీసు ఉన్నతాధికారిని బ్లాక్‌ మెయిల్ చేసినట్టు సమాచారం! హత్యాయత్నం జరిగేందుకు గల కారణాలపై మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 2 Nov 2023 3:35 AM GMT
Ehatv

Ehatv

Next Story