మహిళా అఘోరీ(Lady aghori) తిరిగి శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్కాలనీకి(Shamshahbad airport colony) ఆమె చేరుకుంది.

మహిళా అఘోరీ(Lady aghori) తిరిగి శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్కాలనీకి(Shamshahbad airport colony) ఆమె చేరుకుంది. ఇటీవల ధ్వంసమైన నవ గ్రహ విగ్రహాలను సందర్శించింది.

అఘోరీని చూడడానికి జనాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనాలను కంట్రోల్ చేసేందుకు భారీ బందోబస్తు(Security) ఏర్పాట్లు చేశారు పోలీసులు.

హిందూ ధర్మం(Hindu) రక్షణ కోసం పోరాడుతుంటే.. తనను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని అఘోరీ మండి పడ్డారు. హిందూ దేవాలయాలు ఆడ పిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి(Self sacrifise) చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అఘోరీ. శివ తాండవం చేస్తానంటూ మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది. అంతే కాకుండా తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా పుట్ట లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది, తెలంగాణలో శివ తాండవం జరగ బోతుందని.. ఆడపిల్ల మీద చేయి వేసిన వాడి మర్మాంగాలు కోసేస్తా అని అఘోరీ చెప్పుకొచ్చింది. తెలంగాణలో ఆలయాలు ధ్వంసం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని మండిపడింది. మరోవైపు, పవన్ కళ్యాణ్(Pawan kalyan) కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని.. అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరీ చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా మరోవైపు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలి రండి అని ఆ వీడియోలో పేర్కొంది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. గో హత్యలను నివారించేందుకు పోరాడుదాం అని చెప్పుకొచ్చింది.

Eha Tv

Eha Tv

Next Story