ఉత్తరప్రదేశ్‌లో లేడీ అఘోరీని మోకిలా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో లేడీ అఘోరీని మోకిలా పోలీసులు అరెస్ట్ చేశారు. నగ్న పూజల(Nude Puja) పేరుతో ఒక మహిళ నుంచి రూ.10 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు ఫిర్యాదు రాగా, ఈ కేసులో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. మహిళ డబ్బులు తిరిగి అడిగినప్పుడు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. అఘోరీతో పాటు శ్రీవర్షిణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. వీరిపై చీటింగ్, బెదిరింపుల కేసు నమోదైంది.అరెస్ట్ తర్వాత హైదరాబాద్‌లోని కోర్టులో లేడీ అఘోరీని హాజరుపరిచారు. ఆమె తనకు లాయర్‌ను కేటాయించాలని కోరగా, కోర్టు ఓ అడ్వొకేట్‌ను నియమించింది. న్యాయమూర్తి అఘోరీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు, ఆమెను కంది జైలుకు తరలించారు. కోర్టులో అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది, జైలులో కూడా తన భార్య వర్షిణితోనే ఉంటానని, చట్టానికి సహకరిస్తానని తెలిపింది.
లేడీ అఘోరీ (Lady Aghori)మంగళగిరికి చెందిన శ్రీవర్షిణిని (Sri Varshini)పెళ్లి చేసుకున్న విషయం సంచలనం రేపింది. వర్షిణి తల్లిదండ్రులు ఆమెను మాయమాటలతో లోబరుచుకుని, కేదార్‌నాథ్(Kedarnath)లో బలవంతంగా పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.వర్షిణి మాత్రం ఒక ఇంటర్వ్యూలో తన మనసు అఘోరీకి నచ్చిందని, అతను తన భర్తగా ఎంచుకున్నానని చెప్పింది. ఆమె తన కుటుంబంతో బాధపడినట్లు, అఘోరీతో జీవితం బెటర్ అనిపించిందని వెల్లడించింది. వర్షిణి తండ్రి మాత్రం అఘోరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన కూతురిని మాయం చేశాడని ఆరోపించారు. వర్షిణి పోలీసులకు అఘోరీని విడిచిపెట్టాలని రిక్వెస్ట్ చేసినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.
