కొన్ని రోజులుగా అమ్మాయిలా కనిపిస్తున్న ఓ అఘోరా(Lady ahora) తెగ హడావుడి చేస్తున్నది.
కొన్ని రోజులుగా అమ్మాయిలా కనిపిస్తున్న ఓ అఘోరా(Lady ahora) తెగ హడావుడి చేస్తున్నది. ఈమెను అఘోరీ మాత (ఈ పదం కరెక్టో కాదో) అంటున్నారు. అదే పనిగా అనేక యూ ట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు(Interview) ఇస్తూ హాట్ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్ లో కొండగట్టు, వేములవాడ రాజన్న, కీసర ఆలయాలను ఆ అఘోరీ సందర్శించింది. ఒంటిపై నూలుపోగు(Nude) కూడా లేకుండా, ఒంటి నిండా విభూది రాసుకుని తిరుగుతున్న అఘోరిని చూసి అందరూ బిత్తరపోతున్నారు. మొన్న సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయంపై(Muthyalamma temple) దాడి జరిగిన సమయంలో అక్కడ ప్రత్యక్ష్యమయ్యారామె! అక్కడ ఒంటికాలిపై నిలబడి పూజలు చేశారు. ఆ తర్వాత మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాను శవాలను తింటానని, ఆత్మలతో మాట్లాడతానని చెబుతోంది. ఆమె వ్యవహారశైలిపై చాలా మందికి అనుమానాలు వచ్చాయి. అసలు ఆమె ఆమెనా? లేక అతడా? అన్న డౌట్ కూడా వచ్చింది. పోలీసులకు కూడా అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. నిజంగానే ఆమె అఘోరానేనా? లేక ప్రజలను మోసం చేస్తోందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు తాను అరెస్ట్ కాలేదని, అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని అంటోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అరెస్ట్ చేసుకో అంటూ సవాల్ విసురుతోంది. సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఆర్పిస్తా అని తెలిపింది. ముఖ్యమైన పని మీద బద్రినాథ్ లోని గురువు దగ్గరకు వెళుతున్నానని చెప్పింది. బద్రినాథ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణలో బీభత్సం సృష్టిస్తానంటూ శపథం చేసింది. అరెస్ట్ అయ్యానని..తానో ఫేక్ అఘోరా అని పలు యూట్యూబ్ ఛానళ్లు.. దుష్రచారం చేస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయా యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.