బీఆర్‌ఎస్‌కు(BRS) లబానా లంబాడీలు(Labana Lambadis) జైకొట్టారు. నామినేషన్లు(Nomination) వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. షెడ్యూల్ తెగల కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న కేసీఆర్‌(KCR) ప్రభుత్వానికే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా(కాయితీ) లంబాడీలు స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌కు(BRS) లబానా లంబాడీలు(Labana Lambadis) జైకొట్టారు. నామినేషన్లు(Nomination) వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. షెడ్యూల్ తెగల కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న కేసీఆర్‌(KCR) ప్రభుత్వానికే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా(కాయితీ) లంబాడీలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, మూడోసారి బీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వస్తుందని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించేది ఖాయమని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నట్లు ప్రకటించిన తమ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.

ఎంపి బీబీ పాటిల్ అధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో మంత్రి హరీశ్‌రావును(Harish Rao) వారు కలిశారు. ఈ సందర్బంగా లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర విషయాల గురించి మంత్రికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 'షెడ్యూలు తెగల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది' అని చెప్పారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, సామాజిక, రాజకీయ అంశాల్లో అవకాశాలు కల్పించారన్నారు. గిరిజనుల(Tribes) కల సాకారం చేసేలా, నాలుగు లక్షల ఎకరాలకు పైన పోడు పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది కేసీఆరేనని అన్నారు.

కాంగ్రెస్(Congress), బీజేపీలు(BJP) ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతున్నారని హరీశ్‌ తెలిపారు. న్యాయ సలహా అనంతరం, సీఎం కేసీఆర్ గారి ఆదేశానుసారం లబానా లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు, సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాన్ని తప్పక పరిశీలిస్తామని హరీశ్‌రావు చెప్పారు. హరీశ్ రావును కలిసిన వారిలో లబానా లంబాడీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ తాన్ సింగ్ నాయక్, అమర్ సింగ్ నాయక్, చందా నాయక్, బిషన్ లాల్, జగదీష్, గంగారాం, దర్బార్, గోపాల్ తదితర నాయకులు ఉన్నారు.

Updated On 7 Nov 2023 5:54 AM GMT
Ehatv

Ehatv

Next Story