కేటీఆర్(KTR), హరీష్‌రావు(Harish Rao), కేవీపీ ఫాంహౌజ్‌లను(KVP Farmhouses) కూల్చొద్దా అని నిన్న సీఎం రేవంత్‌రెడ్డి(CM revanth) వ్యాఖ్యలపై కేవీపీ స్పందించారు
కేటీఆర్(KTR), హరీష్‌రావు(Harish Rao), కేవీపీ ఫాంహౌజ్‌లను(KVP Farmhouses) కూల్చొద్దా అని నిన్న సీఎం రేవంత్‌రెడ్డి(CM revanth) వ్యాఖ్యలపై కేవీపీ స్పందించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన ఓ లేఖ రాశారు. తన ఫాంహౌజ్ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉంటే నిర్ధాక్షిణ్యంగా కూల్చాలని లేఖలో పేర్కొన్నారు. అధికారులను మా ఫాంహౌజ్‌కు పంపించాలని.. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉంటే మార్క్ చేస్తే.. తన సొంత ఖర్చులతో కూల్చేస్తానని కేవీపీ అన్నారు. నాకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపు అవసరం లేదని.. చట్టం తన పనితాను చేసుకొని వెళ్లాలని కేవీపీ ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకూడదని, నాలో ఉన్న రక్తం కాంగ్రెస్‌కు చెడ్డ పేరు వస్తే సహించదని తెలిపారు. 48 గంటలలో ప్రభుత్వానికి భారం కాకుండా, మా సొంత ఖర్చులతో ఆ కట్టడాన్నికూల్చి, ఆ వ్యర్ధాలను తొలగించి, శుభ్రం కూడా చేస్తామని మా కుటుంబ సభ్యుల తరుపున మీకు హామీ ఇస్తున్నానని కేవీపీ అన్నారు. అయితే ఈ మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నదే తన కోరిక అని కేవీపీ అన్నారు. ఆ మార్కింగ్ చేసే సమయం, తేదీ ముందే ప్రకటిస్తే, తనపై పదేపదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియావారు కూడా తీరికచేసుకొని వచ్చి, ఈ ప్రక్రియని వీక్షించే అవకాశం కలుగుతుందని పారదర్శకత కోసం ఇది నా సూచన మాత్రమేని కేవీపీ అన్నారు.