బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమతపై(Mamatha) ఇన్నాళ్లకు బదిలీవేటు పడింది. 2010 నుంచి జీహెచ్ఎంసీలోనే(GHMC) మమత పని చేస్తూ వచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని ఓ మంత్రితో ఉన్న సన్నిహిత సంబంధాలను అడ్డుపెట్టుకుని ఆమె కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా(Zonal Commissioner) కొనసాగారు.

బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమతపై(Mamatha) ఇన్నాళ్లకు బదిలీవేటు పడింది. 2010 నుంచి జీహెచ్ఎంసీలోనే(GHMC) మమత పని చేస్తూ వచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని ఓ మంత్రితో ఉన్న సన్నిహిత సంబంధాలను అడ్డుపెట్టుకుని ఆమె కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా(Zonal Commissioner) కొనసాగారు. గతంలో జూబ్లీ హిల్స్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసినా 24 గంటల్లో శేరిలింగంపల్లి సర్కిల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారంటే ఆమె పరపతి ఎంతటితో ఆర్థం చేసుకోవచ్చు. ఇన్నేళ్ల తర్వాత ఆమె ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ప్రస్తుతం కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న మమతను నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌(National Institute of Urban Management) డైరెక్టర్‌గా నియమించారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మమత హవా మామూలుగా ఉండేది కాదు. పదవీ విరమణ చేయాల్సిన భర్తను మంత్రి అండతో కాపాడుకోగలిగారు. పదవీ విరమణ వయసును ఏకంగా 58 నుంచి 61 ఏళ్లకు పెంచే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారని అంటుంటారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఆమె నమ్ముకున్న మంత్రి కూడా ఓడిపోయారు. దాంతో ఆమె కొన్ని రోజుల పాటు సెలవులో వెళ్లారు.

Updated On 6 Jan 2024 7:02 AM GMT
Ehatv

Ehatv

Next Story