ఆరేళ్ల కిందట గచ్చిబౌలిలోని(Gachibowli) బొటానికల్‌ గార్డెన్‌(Botanical Garden) దగ్గర రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణ హత్య(Murder) ఘటన ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఈ ఘోరానికి పాల్పడిన నలుగురికి కూకట్‌పల్లి సెషన్స్‌ కోర్టు(Kukatpally Special court) బతికి ఉన్నంతకాలం జైలులోనే ఉండేలా జీవితఖైదు(Life Imprisonment) విధించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆరేళ్ల కిందట గచ్చిబౌలిలోని(Gachibowli) బొటానికల్‌ గార్డెన్‌(Botanical Garden) దగ్గర రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణ హత్య(Murder) ఘటన ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఈ ఘోరానికి పాల్పడిన నలుగురికి కూకట్‌పల్లి సెషన్స్‌ కోర్టు(Kukatpally Special court) బతికి ఉన్నంతకాలం జైలులోనే ఉండేలా జీవితఖైదు(Life Imprisonment) విధించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బింగి అలియాస్‌ పింకి అలియాస్‌ శాలినిది(Shalini) నిరుపేద కుటుంబం. వీరిది బీహార్‌లోని(Bihar) బాంకా జిల్లా మోహన్‌మల్టీ గ్రామం. బింగి నాన్న దబ్బోలెయ్యా రాజస్తాన్‌లో ఓ ఇటుకల పరిశ్రమలో(Brick factory) పని చేసేవాడు. ఏడాదికి ఓసారి మాత్రం అతడు సొంతూరుకు వచ్చి వెళుతుండేవాడు. 2005లో ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్‌ జిల్లా చాందూసి టౌన్‌కు చెందిన దినేశ్‌తో బింగి పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భర్తతో విభేదాలు వచ్చాయి. తర్వాత చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్‌ కశ్యప్‌తో బింగికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

వికాస్‌తో పాటు ఓ కుమారుడిని తీసుకుని బింగి 2017లో మోహన్‌మల్టీ గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్‌కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్‌ను వదిలిపెట్టాడు. ఇదిలా ఉంటే ఆర్దిక ఇబ్బందుల కారణంగా వికాస్‌, భర్త అనిల్‌ ఝాలతో కలిసి మమత ఝా హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటికే మమత కొడుకు అమర్‌కాంత్‌ ఝా ఇక్కడ దలాల్‌ స్ట్రీట్‌ బార్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. వీరందరూ సిద్దిఖీ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. వికాస్‌(Vikas), మమత(Mamatha) సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్‌ పెట్టారు. అతి కష్టం మీద వికాస్‌ అడ్రస్‌ కనుక్కున్న బింగి కూడా హైదరాబాద్‌కు వచ్చింది.

అప్పటి నుంచి వికాస్‌, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పికే బింగి ఎనిమిది నెలల గర్భిణి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్‌ డబ్బులన్నీవారికే ఖర్చు పెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఎలాగైనా సరే బింగిని చంపేయాలని అనుకుంది. ఆమె ఆలోచనకు వికాస్‌తో పాటు మిగిలిన వారంతా ఓకే అన్నారు. 2018 జనవరి 27వ తేదీ అర్దరాత్రి మమత, వికాస్‌లు బింగితో కొట్లాట పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే బింగి మెడపట్టుకుని మమత బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోయింది. వెంటనే మమత, వికాస్‌ ఆమె నోరు, కాళ్లు చేతులు గట్టిగా పట్టుకున్నారు.

మమతతో పాటు ఆమె భర్త అనిల్ ఝా, కొడుకు అమర్‌కాంత్‌ ఝా(Amarkanth Jha) బింగిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ దెబ్బలకు తట్టుకోలేక బింగి అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత బింగి మృతదేహాన్ని ఓ రోజు మొత్తం బాత్‌రూమ్‌లో ఉంచారు. తర్వాతి రోజు అమర్‌కాంత్‌ ఎలక్ట్రికల్‌ కటింగ్‌ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో పెట్టాడుతాను పనిచేస్తున్న బార్‌లో ఫ్లోర్‌ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్‌కు చెందిన బైక్‌ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర పడే శారు.

ఉదయం జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మకులు ఈ గోనెసంచులను గుర్తించారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. బ్లూ కలర్‌ షర్ట్ వేసుకుని, కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్‌ బౌద్దనగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్‌గౌడ్‌ దగ్గరకు, ఆపై సిద్ధార్థ బర్దన్‌ చేతికి వచ్చింది.

ఇతడు హఫీజ్‌నగర్‌లో రాంగ్‌రూట్‌లో వెళుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన స్పాట్‌ పేమెంట్‌ చలాన్‌ద్వారా అతడి ఫోన్‌ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దాంతో అమర్‌కాంత్, మమత, వికాస్, అనిల్‌ పేర్లు వెలుగులోకి వచ్చాయి. కేసు కొలిక్కి వచ్చింది. కేవలం 13 రోజుల్లోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు విచారించిన కూకట్‌పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జ్‌ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం కారాగారంలోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టర్‌ ఎం.గంగాధర్‌ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్‌గా మారింది.

Updated On 6 Jan 2024 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story