అమృత్ స్కీంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత్ర ఉందని కేసీఆర్ డైరెక్ట్ అటాక్ చేశారు.
అమృత్ స్కీంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత్ర ఉందని కేసీఆర్ డైరెక్ట్ అటాక్ చేశారు. రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)బావమరిది సృజన్‌రెడ్డికి (Srujan Reddy)చెందిన కంపెనీకి 11 వందల కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారని విమర్శించారు. రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి ఇన్ని వందల కోట్ల కాంట్రాక్ట్ ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. సీఎం ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో భారీ అవినీతి జరిగిందని.. అమృత్ పథకం కింద తాగునీటి ప్రాజెక్టులు కోసం టెండర్లు పిలిచిన వ్యవహారంలో ఈ స్కాం జరిగిందన్నారు. రేవంత్ బావమరిదికి అమృతం.. తెలంగాణ ప్రజలకి విషం పంచుతున్నారని అన్నారు. దీనిపై పొంగులేటి స్పందించారు.. దమ్ముంటే నిరూపించాలని లేదంటే కేటీఆర్(KTR)రాజీనామా చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. దీనికి ప్రతి సవాల్‌గా కేటీఆర్.. నేరుగా హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా కేంద్ర విజిలెన్స్ దగ్గరికి వెళ్దామని నిరూపితం కాకుంటే శాశ్వతంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్తానని కేటీఆర్ కూడా బహిరంగ సవాల్ విసిరారు. అయితే ఈ వ్యవహారంపై ఈరోజు కేటీఆర్ చేసిన తీరు చర్చనీయాంశమైంది. కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ 'అమృత్ స్కీం(Amrut Scheme)ను బయటపెట్టినందుకు కాంగ్రెస్ సీనియర్ల నుంచి అభినందనలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ(BJP)నేతలకు ఈ కుంభకోణం కనపడం లేదని.. తెలంగాణ(Telangana)బీజేపీ నాయకుల నిశ్శబ్దం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది.. రేవంత్ రెడ్డి, బీజేపీ అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ'(Ajab Prem Ki Ghazab Kahani)అని అన్నారు.