హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ కాలనీల సమస్యలపై ప్రజల ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ కాలనీల సమస్యలపై ప్రజల ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 48 గంటల్లో సమస్యలను పరిష్కరించకుంటే బీఆర్‌ఎస్ నేతృత్వంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.
బండ్లగూడలోని అరుంధతి ఎన్‌క్లేవ్‌కు చెందిన సుమంత్ పోస్ట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. చెట్ల పెరుగుదల, చెత్త, అధ్వాన్నమైన రోడ్లు, నీటి సౌకర్యాల లేమి సమస్యలను ఎత్తిచూపారు. సుమంత్ తన కాలనీలోని సుమారు 50 కుటుంబాలను ప్రభావితం చేసే రాత్రి వేళ దొంగతనాలను గురించి పేర్కొన్నాడు.
ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంలో GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పందించి పరిష్కరించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, మేయర్ ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు.