ఎయిర్‌పోర్టుకు పీవీ లేదా జయశంకర్ పేరు
తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో పెడుతున్న ఆ రాజీవ్ గాంధీ(Rajiv gandhi) విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము ఉన్నపుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ సచివాలయం(Telangana secreteriat), అమరవీరుల స్థూపం మధ్య రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అసలు అమరవీరుల స్థూపంతోగానీ, సచివాలయంతోగానీ రాజీవ్‌గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు అక్కడే ఎందుకు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కరెక్ట్ అని అన్నారు. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎయిర్‌పోర్టుకు రాజీవ్‌గాంధీ పేరు ఉంటే మార్చలేదు. కానీ ఈ ప్రభుత్వ వైఖరి చూసి తమ వైఖరి మార్చుకున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం(shamshabad Airport) పేరును తొలగించి తెలంగాణ మహనీయుల పేరు పెడుతామని కేటీఆర్ వెల్లడించారు. అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ ఎయిర్‌పోర్ట్ అని పేరు మారుస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.