ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్(Ease of Doing Business Reformers) ర్యాంకింగ్‌లో కేరళ (Kerala)అగ్రస్థానంలో నిలిచింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్(Ease of Doing Business Reformers) ర్యాంకింగ్‌లో కేరళ (Kerala)అగ్రస్థానంలో నిలిచింది. కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నిలిచింది. కానీ తెలంగాణ(Telangana)వరెస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ప్రకటించిన ఏడాది నుంచి తొలి మూడు స్థానాల్లో ఉండే తెలంగాణ ఈసారి పూర్తిగా వెనుకబడిపోయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలోని తొమ్మిది సూచీల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. రెండోస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఐదు సూచీల్లోనూ, గుజరాత్(Gujarat) మూడు సూచీల్లోనూ ముందున్నాయి. అరుణాచల్ ప్రదేశ్(Arunchal Pradesh), తెలంగాణ, పంజాబ్(Punjab), పుదుచ్చేరి ర్యాంకింగ్‌లో బాగా వెనుకబడ్డాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయెల్(Piyush Goyal) మీదుగా కేరళ సీఎం పినరయ్(Pinarayi Vijayan)అవార్డు అందుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని కేటీఆర్ ఎక్స్ ద్వారా ఎండగట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈఓడీబీ ర్యాంకింగ్స్‌లో నిలకడగా అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ ఇప్పుడు ఈఓడీబీ సంస్కర్తల ర్యాంకింగ్స్‌లో కూడా చోటు దక్కించుకోకపోవడం విచారకరమని కేటీఆర్ అన్నారు. తాజా ర్యాంకింగ్స్ తెలంగాణలో రేవంత్(CM Revanth) ప్రభుత్వ దుష్పరిపాలనకు అద్దం పడుతున్నాయని..తెలంగాణా లాంటి అత్యున్నత పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం ఇప్పుడు అధ్వాన్నంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ లాంటి చేతకాని ముఖ్యమంత్రి అసమర్థత వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎలా దెబ్బతింటోందో కూడా ఈ ర్యాంక్ చెప్తోందని కేటీఆర్ విమర్శించారు.