ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ తగ‌్గడంపై కేటీఆర్‌ సెటైర్లు వేశారు. ఎక్స్‌వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ తగ‌్గడంపై కేటీఆర్‌ సెటైర్లు వేశారు. ఎక్స్‌వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ''పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో సౌ'భాగ్యనగరం' 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ'భాగ్యనగరం' హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో తగ్గిన ఇండ్ల కొనుగోళ్లు. పేదల ఇండ్ల పైకి బుల్డోజర్లు, పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు. రియల్ ఢమాల్, ఇన్‌ఫ్రా సజీవ సమాధి. మూసీ, హైడ్రా పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు.. అమ్మకాలు జరగక ఆందోళనలో రియల్టర్లు, అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి! హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో 49 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు. ఆఫీస్ లీజింగ్ కూడా అధః పాతాళానికి. 2025 జనవరి - మార్చి మధ్య 41 శాతం తగ్గుదల. కాంగ్రెస్ సర్కార్ దూరదృష్టి లేని, అసమర్థ విధానాలే ఈ పతనానికి కారణం. కూల్చడం కాదు ... కట్టడం నేర్చుకోండి

అబద్దాలు చెప్పడం కాదు.. అభివృద్ధి చేయడం నేర్చుకోండి. జాగో తెలంగాణ జాగో'' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ehatv

ehatv

Next Story