రైతు బంధు పథకం అమలు విధానం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు

రైతు బంధు పథకం అమలు విధానం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు కేటీఆర్ రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చి గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రైతు భరోసా పై కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇవ్వలేదు.

అయితే రైతు భరోసా అమలు పైసబ్ కమిటీ ఒక నివేదికను సి.ఎం. కు సమర్పిన్స్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే మరోసారి రైతుల దగ్గరి నుండి దరఖాస్తులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతు భరోసా కోసం రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సి ఉంది అన్నట్టుగా న్యూస్.

ఇదే విషయం పై బీ.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్. సీరియస్ అయ్యారు. ఇన్ని సంవత్సరాలుగా రైతు బంధు వేస్తుండగా ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సింది రైతులు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. రైతు బంధు దుర్వినియోగం చేసారు అంటున్నారు... ఏ రైతు నిధులు దుర్వినియోగం చేశారో.. దమ్ముంటే గ్రామాలలో లిస్ట్ పెట్టాలని సవాల్ విసిరారు కే టీ ఆర్

రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, సబ్ కమిటీ రిపోర్ట్ కూడా కావాలనే ఆలస్యం చేస్తున్నారని, రైతు బంధు పతకాన్ని బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారనికే టీ ఆర్ఫైర్ అయ్యారు. రైతులు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని ప్రశ్నించారు. ప్రజా పాలన పత్రాల్లో తీసుకున్న వివరాలు ఉన్నాయి కదా మళ్లీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకు అని ప్రశ్నించారు. ఖచ్చితంగా బీ.ఆర్.ఎస్. పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తుందని కే టీ ఆర్ చెప్పారు.

ehatv

ehatv

Next Story