రేవంత్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ సెటైర్లు వేశారు.

రేవంత్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ సెటైర్లు వేశారు. కేసీఆర్‌ హయాంలో కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు మూడు రంగులు వేయడంపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ ' కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం నీ తరం కాదు. ఆయన నిర్మించిన ఇళ్ళకు సున్నాలు వేసి.. ఇందిరమ్మ ఇళ్లని ప్రజల కళ్లకు గంతలు కట్టలేవు. గోసపడ్డ ప్రతి గుండెకు తెలుసు, ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఆయన పడ్డ తపన ప్రతి పేదవాడి కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు…కేసీఆర్ కల.. ఎన్నాళ్లున్నా ఆ నిర్మాణాలకు మీరు కేవలం పెయింటర్లు మాత్రమే. ఎప్పటికీ మీరంతా సున్నాల వేసే సన్నాసి బ్యాచ్ మాత్రమే' అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

ehatv

ehatv

Next Story