తెలంగాణకు మొండి చేయి చూపడంపై కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. 'తెలంగాణ గెట్స్‌ జీరో ఇన్‌ యూనియన్‌ బడ్జెట్' అని ఏకంగా హోర్డింగ్‌లు పెడుతున్నారు.

తెలంగాణ(Telangana)కు మొండి చేయి చూపడంపై కేంద్ర ప్రభుత్వం(Central Govt)పై తెలంగాణ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. 'తెలంగాణ గెట్స్‌ జీరో ఇన్‌ యూనియన్‌ బడ్జెట్'(Telangana Gets Big Zero in Union Budget) అని ఏకంగా హోర్డింగ్‌లు పెడుతున్నారు. ఎన్నడూ లేనిది తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే, అందులో ఇద్దరు కేంద్రమంత్రులుగా ఉండి కూడా రాష్ట్రానికి నిధులు సాంధించలేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ అయితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. చెరో 8 స్థానాలు దక్కించుకుని రాష్ట్రానికి మీరు సాధించిందేంటని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు.

'తెలుగు కోడలు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) గారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం కానీ దక్కింది శూన్యమని అన్నారు. రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం.. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు . అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం మాత్రం స్పందించలేదని కేటీఆర్‌(KTR) అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదని.. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వారని ఆయన అభిప్రాయపడ్డారు.

Eha Tv

Eha Tv

Next Story