దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని రేవంత్‌రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.

దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని రేవంత్‌రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది. ఈ అంశంపై ఇటీవల మీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర పాటు చర్చ జరిగినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో ప్రజాస్వామ్యవిధానంలో, ప్రజల ముందే చర్చ జరిగితే నిజానిజాలు తేలుస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్(Hyderabad) నగరానికి మంచి జరగాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక పారదర్శక ఒప్పందం కుదుర్చింది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ది చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉండగా, మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని ఏకపక్షంగా రద్దు చేసింది. ఆ దశ నుంచి, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా, ఫార్ములా-ఈ రేస్(Formula-E Race) గురించి అనేక అవాస్తవాలను ప్రచారం చేసి, అనవసర అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోంది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం పూర్తిగా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా జరిగినట్లు నేను ఇప్పటికే వివరణ ఇచ్చాను. ఇప్పటికీ, మీ ప్రభుత్వం మాత్రం నిరాధార దుష్ప్రచారం మానటం లేదు. రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలుసుకునే హక్కు ఉంది. అందువల్ల, ఈ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపై శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

ehatv

ehatv

Next Story