గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టుగా ఉంటుంది!
సెక్రటేరియట్‌లోపల తెలంగాణ తల్లి విగ్రహం(Telangana thalli statue) పెడతామని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) ఇవాళ అందుకోసం భూమి పూజ చేశారు. ఎప్పటిలాగే ఆ కార్యక్రమంలో కూడా బీఆర్‌ఎస్‌ను(BRS), ఆ పార్టీ నేతలను అనరాని మాటలు అన్నారు. ఈ క్రమంలో ఎక్స్ (twitter) ద్వారా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. సోనియాగాంధీని(Sonia gandhi) దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద(Rajiv gandhi) ప్రేమ ఒలకబోసేది అంటూ రేవంత్‌ను నిలదీశారు. కేటీఆర్ ఎక్స్‌లో ఇంకా ఏం రాశారంటే 'దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు.... నీఆలోచనల్లో కుసంస్కారం ... నీ మాటలు అష్ట వికారం .....తెలంగాణతల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రేస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే .... గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో
తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం'
జై తెలంగాణ
అంటూ కేటీఆర్ ముగించారు.
సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది....
— KTR (@KTRBRS) August 28, 2024
దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు....
నీఆలోచనల్లో కుసంస్కారం ... నీ మాటలు అష్ట వికారం .....
తెలంగాణతల్లి…