✕
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను తమ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

x
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను తమ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి(Cm Revanth reddy) విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా ఆ భూముల్ని కొనుక్కుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. అక్కడ అద్భుతమైన ఏకో పార్క్ ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్(Hyderabad) నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామన్నారు కేటీఆర్. హెచ్.సి.యూ వివాదంపై తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్(KTR), సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి హృదయపూర్వక సెల్యూట్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి నిర్ణయాన్ని మార్చుకోకపోతే వేలాది మందితో హెచ్‌సీయూ (HCU) కు మార్చ్ లాగా తరలి వెళ్తామన్నారు కేటీఆర్.

ehatv
Next Story