ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. రియల్‌ ఎస్టేట్‌ ఆదాయం గత 2023-సెప్టెంబర్‌తో పోలిస్తే 30 శాతం పడిపోవడంపై కేటీఆర్‌(KTR) మండి పడ్డారు. 'చీప్‌ మినిస్టర్‌(Chief Minister)' అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ ' ప‌నిమంతుడని పందిరేపిస్తే... పిల్లి తోక త‌గిలి కూలింద‌ట‌.. గ‌ట్ల‌నే ఉంది చీప్ మినిస్ట‌ర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణ‌(Telangana)కు గుండెకాయ వంటి హైద‌రాబాద్(hyderabad) ను కాపాడుకోవ‌టం చేత‌కాక‌, సామాన్యుల‌పైకి బుల్డోజ‌ర్స్ పంపి... భ‌యాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం ప‌డిపోయింది. హైడ్రా హైరానాతో 2నెల‌ల్లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోయింది. రిజిస్ట్రేష‌న్లు ప‌డిపోయాయి. ఆదాయం త‌గ్గిపోయింది.

అయ్యా...నువ్వు కొత్త‌గా ఆదాయం సృష్టించుడు లేకుంటే పాయే. కానీ, ఉన్న‌ది ఊడ‌గొడుతున్న‌వ్. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తున్నావో అర్థ‌మైతుందా? నీ ఫోర్ బ్ర‌ద‌ర్ సిటీపై ఫోక‌స్ చేసి, అక్క‌డ కృత్రిమ రియ‌ల్ బూమ్ కోసం ఆలోచిస్తున్న‌ట్లున్న‌వ్... సామాన్యులు కొనుగోలు, అమ్మ‌కం లేనిది బూమ్ ఎట్లా వ‌స్త‌ది? ఆదాయం ఎట్లా పెరుగుత‌ది.. ఏం చేద్దాం అనుకుంటున్న‌వ్ స్వామి తెలంగాణ‌ను...!' అంటూ ఆయన రేవంత్‌ను విమర్శించారు.

ehatv

ehatv

Next Story