తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్( TSPSC ) పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగానే పేపర్‌ లీక్‌ అయ్యిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంతరి కేటీఆర్‌ ( Minister KTR ) అన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా మళ్లీ ఎగ్జామ్‌కు అటెండవ్వొచ్చని కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 37 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఏ పరీక్షపై కూడా ఆరోపణలు రాలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్( TSPSC ) పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగానే పేపర్‌ లీక్‌ అయ్యిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంతరి కేటీఆర్‌ ( Minister KTR ) అన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా మళ్లీ ఎగ్జామ్‌కు అటెండవ్వొచ్చని కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 37 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఏ పరీక్షపై కూడా ఆరోపణలు రాలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కంప్యూట‌ర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 99 ప‌రీక్ష‌లు నిర్వ‌హించామని, నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాశారని కేటీఆర్‌ అన్నారు. యూపీఎస్‌సీ ఛైర్మన్‌ రెండు సార్లు తెలంగాణకు వచ్చి టీఎస్‌పీఎస్‌సీని సందర్శించి అధ్యయనం చేశారని మంత్రి వివరించారు. అలాగే దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ఛైర్‌ పర్సన్లు కూడా మన టీఎస్‌పీఎస్‌సీ ని అధ్యయనం చేసి వారి వారి రాష్ట్రాలలో ఇంప్లిమెంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్‌సీ మీద అనేక అరోపణలు వచ్చాయని, కానీ 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ టీఎస్‌పీఎస్‌సీ మీద ఒక్క ఆరోపణ కూడా రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంటర్వ్యూల్లో పొరపాట్లు జరిగాయని తెలుసుకుని పారదర్శక కోసం రాత పరీక్ష, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని కేటీఆర్‌ తెలిపారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇద్ద‌రు వ్య‌క్తులు చేసిన త‌ప్పు వ‌ల్ల మొత్తం వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు వ‌చ్చింద‌న్నారు కేటీఆర్‌. ఈ ఇద్ద‌రు వ్య‌క్తులే కాదు.. వీళ్ల వెన‌కాల ఎవ‌రున్నా త‌ప్ప‌కుండా కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కేటీఆర్‌. ఈ విష‌యంలో ఎలాంటి రెండో అభిప్రాయం పెట్టుకోవ‌ద్దన్నారు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల‌ ల‌క్ష‌లాది మంది పిల్ల‌ల‌కు ఇబ్బంది క‌లుగుతుందన్నది తమకు కూడా తెలుసని, అందుకే తాము కూడా బాధ‌ప‌డుతున్నామని కేటీఆర్‌ అన్నారు.. వీలైనంత త్వ‌ర‌గా ఎగ్జామ్స్ నిర్వ‌హిస్తామని స్పష్టం చేశారు. అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో.. గ్రూప్-1, టీపీబీవో, డీఏవో, ఏఈఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన మెటిరీయ‌ల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్ట‌డీ స‌ర్కిళ్ల‌ను బ‌లోపేతం చేస్తామని, ఫ్రీ మెటిరీయ‌ల్‌తో పాటు ఉచిత భోజ‌న వ‌స‌తి కూడా క‌ల్పిస్తాం అని కేటీఆర్ అన్నారు.

Updated On 18 March 2023 4:00 AM GMT
Ehatv

Ehatv

Next Story