హెచ్‌సీయూ భూముల్లో పర్యావరణ విధ్వంసమే కాదు..10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).

హెచ్‌సీయూ భూముల్లో పర్యావరణ విధ్వంసమే కాదు..10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఈ భూ కుంభకోణం కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి(Revanth Reddy)నే అన్నారు. భూయాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే పది వేల కోట్ల లోన్ ఇచ్చిన ఐసిఐసిఐ(ICICI) బ్యాంకు తన క్రెడిబులిటీని కోల్పోయిందన్నారు. త్వరలోనే ఆ బ్యాంకు కుప్పకూలడం ఖాయమన్నారు. ఈ స్కాం పై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రధాని మోడీ (PM Modi)వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు కేటీఆర్. ప్రజల దృష్టి మరల్చి భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడింది. అక్కడ పర్యావరణ విధ్వంసం, మూగజీవుల ప్రాణాలు మాత్రమే తీయలేదు. హెచ్ సి యు(HCU) పక్కన ఉన్న అటవీ భూములను అడ్డం పెట్టుకుని ఒక అతిపెద్ద ఆర్థిక మోసానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడిందని కేటీఆర్‌ అన్నారు. రాత్రికి రాత్రి బుల్డోజర్లను పెట్టి వందల ఎకరాల్లో చెట్లను కూల్చివేసి మూగజీవాలకు నిలువ నీడ లేకుండా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆరాటం వెనుక పదివేల కోట్ల రూపాయల స్కాం ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ అని ప్రత్యేకంగా డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నా దాన్ని అటవీ భూమి గానే గుర్తించాలని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాంటి భూముల లెక్కలు తీయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చిందని కేటీఆర్‌ అన్నారు. అటవీశాఖ అనుమతి లేదు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేయలేదు. అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి రానికి పాల్పడింది. ఒక బీజేపీ ఎంపీ(Bjp Mp) పూర్తి స్థాయిలో సహకరించి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ (Trust Investment Advisors Private Limited)అనే బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ ను చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం(FRBM)ను బైపాస్ చేసి డబ్బులు తీసుకొస్తామని చెప్పి అందుకు కమిషన్ ఇవ్వాలని ఆ కంపెనీ కోరింది. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 169 కోట్లు లంచం చెల్లించింది. ఆ తరువాత బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని ముందట పెట్టి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పు రాగానే 75 కోట్లకు ఒక ఎకరం చొప్పున ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ(TGIIC)కి బదిలాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. జీవో మాత్రమే ఇచ్చారు కానీ ఆ భూమిని ఏలియనైజేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా చేయలేదు. అంటే ప్రభుత్వానికి ఆ భూమిపై ఓనర్ షిప్ రాలేదన్నట్టే . టిజిఐఐసికి ఆ భూములపై ఓనర్షిప్ లేదు. తనది కాని భూమిని బ్రోకర్ కంపెనీ మాట విని టీజీఐఐసి తాకట్టు పెట్టింది. ఈ మోసానికి టీజీఐఐసీ తో పాటు పరిశ్రమల శాఖ సెక్రెటరీని జైల్లో వేయొచ్చు ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా, భూ యాజమాన్య హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకోకుండానే ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్ల డబ్బులు చెల్లించింది. ప్రభుత్వము, బ్రోకర్ సంస్థ ,ఐసిఐసిఐ బ్యాంకు కుమ్మక్కై ఆ భూమికి లేని విలువను ఉన్నట్టుగా చూపించి పదివేల కోట్ల లోన్ తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంకును, దేశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. అదే బ్యాంకరు, అదే బ్రోకర్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఆ భూములను తమ మనుషులకు అడ్డికి పావు సేరు అమ్మడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని కేటీఆర్‌ ఆరోపించారు. భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండానే టీజేఐఐసీ ఆ భూమిని ఐసిఐసిఐ బ్యాంకుకు ఎలా తనఖా పెట్టింది? సెల్ డిడ్ కూడా లేని భూమికి ఐసిఐసిఐ బ్యాంకు ఎలా రుణం ఇచ్చింది. ? ఇది ఫ్రాడ్ కాదా? బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, ట్రస్ట్ అడ్వైజర్స్ అనే బ్రోకర్ని ప్రభుత్వం ఎలా ఎంపిక చేసింది ? ఏ రూల్స్ ని ఫాలో అయ్యారు?బీజేపీ ఎంపీ చెప్పాడని వాళ్లకు ఇచ్చారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

ehatv

ehatv

Next Story