ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిస్ లపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అవి ఈడీ సమన్లు కాదు..మోదీ సమన్లు అంటూ ఎద్దేవా చేశారు. గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించిన కేటీఆర్, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిస్ లపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అవి ఈడీ సమన్లు కాదు..మోదీ సమన్లు అంటూ ఎద్దేవా చేశారు. గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించిన కేటీఆర్, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రులు గంగుల, మల్లారెడ్డి, తలసాని, నామా, వద్దిరాజు, రమణ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రోహిత్ రెడ్డి ఇలా 12 మంది పార్టీ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ ఏజెన్సీలను ఉసిగొల్పారని ఆరోపించారు. ఇప్పుడు కవితకు సమన్లు పంపడం వెనక కేంద్రమే ఉందని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ ఏజెన్సీలు మోదీ చేతుల్లో కీలుబొమ్మ, తోలుబొమ్మలుగా మారాయని మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

2014 తర్వాత ఈడీ దాడులన్నీ విపక్షాలపైనే జరుపుతూ దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మోడీని వ్యతిరేకించే విపక్ష పార్టీల నేతలే టార్గెట్ గా అక్రమంగా కేసులు పెట్టించారని అన్నారు. ఇప్పటి వరకు విపక్ష పార్టీల నేతలపై మోదీ ప్రభుత్వం మొత్తం 5,422 కేసులు పెట్టిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 95 శాతం దాడులు విపక్షాలపైనే జరుగుతున్నాయన్న మంత్రి కేటీఆర్, బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఏమవుతున్నాయి? ఎందుకు నీరుగారిపోతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే జుమ్లా, లేదంంటే హమ్లా ఇదే మోదీ విధానమని అన్నారు. దేశంలో ఎనిమిదేళ్లుగా ఓ ప్రహసనం నడుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. అసలు దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు.
నీతిలేని పాలనకు కేంద్రం పర్యాయపదంగా మారిందని విమర్శించారు. యూపీఏలో అవినీతి జరిగిదంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడేమంటారు?

మోదీ ‎ఆదానీ చీకటి స్నేహం అందరికీ తెలుసున్న మంత్రి కేటీఆర్.. గౌతమ్ ఆదానీ ప్రధాని మోదీ బినామీ కాదా? అని ప్రశ్నించారు. మోదీ, అదానే డబుల్ ఇంజిన్ అన్నారు. అదానికి 13 పోర్టులు ఇవ్వడాన్ని నీతి అయోగ్ తప్పుపట్టింది మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. LIC, SBIకి చెందిన రూ.13 లక్షల కోట్లు మాయమైనా.. దానిపై ప్రధాని గానీ, కేంద్ర ఆర్థిక మంత్రి గానీ స్పందించట్లేదని కేటీఆర్ ఆరోపించారు. గౌతం అదానీకి 6 ఎయిర్ పోర్టులు ఇవ్వడం తప్పన్న కేటీఆర్... ముంద్రా పోర్టులో 3వేల కేజీల హెరాయిన్.... 21 వేల కోట్ల విలువైనది దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు కేటీఆర్. అయినా అదానీపై చర్యలు లేవు,కేసులు ఉండవని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 6 పోర్టులను అదానీకి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు.

దేశంలో లిక్కర్ స్కామ్ పెద్ద చర్చకు దారి తీసిందన్న మంత్రి కేటీఆర్.. కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనబోయి దొరికిపోయిన బీఎల్ సంతోష్ లాగా స్టే తెచ్చుకోబోమని, ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనే దమ్ము తమకు ఉందని అన్నారు. గుజరాత్ లో నిషేధం ఉన్నా లిక్కర్ తాగి 42 మంది చనిపోవడం పెద్ద స్కామ్ అని అన్నారు. అదానీ నుంచే బొగ్గు కొనాలని పాలసీ చెయ్యడం మరోస్కామని, నిబంధనలు కాదని 6 ఎయిర్ పోర్టులు అదానీకి ఇవ్వడం స్కామని, అదానీ పోర్టుల్లో డ్రగ్స దొరికినా విచారణ లేకపోవడం పెద్ద స్కామని, గంగవరం, కృష్టపట్నం, ముంబై ఎయిర్ పోర్టులు లాక్కోవడం స్కామని కేంద్రపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.

Updated On 9 March 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story