రాఖీ రోజు మా సోదరీమణి కవిత మాతో లేకపోవడం బాధాకరం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్య‌క్తం చేశారు

రాఖీ రోజు మా సోదరీమణి కవిత మాతో లేకపోవడం బాధాకరం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్య‌క్తం చేశారు. ఆమెకి న్యాయం లభిస్తుందని.. సుప్రీంకోర్టు పైన నమ్మకం ఉంద‌న్నారు. రాష్ట్రంలోని సోదర సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం అస్త‌వ్య‌స్తంగా ఉండేదన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే కూడా ఫైర్ ఇంజన్ రాని పరిస్థితి ఉండేదన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్.. సచివాలయ పునర్నిర్మానం చేద్దామనుకున్నారు. తెలంగాణ పౌరుషం తెలంగాణ వైభవాన్ని చాటేలా నూతన సచివాలయం నిర్మించాలనుకొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అద్భుతమైన నివాళి అందించేలా మహనీయుడి అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని సచివాలయానికి పెట్టుకున్నామ‌న్నారు. సచివాలయంలో కూర్చుని పాలించే ప్రతీ పాలకుడికి అమరవీరుల త్యాగాలు స్ఫూర్తినిచ్చేలా ఒక అద్భుతమైన అమర జ్యోతి స్మారకని నిర్మించామ‌న్నారు.

తెలంగాణ అస్థిత్వానికి.. ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్టించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్ క్రియేట్ చేయడం జరిగిందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ కు సంస్కార పార్టీ అని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అనడు.. మహనీయుడు అంబేద్కర్‌కి కనీసం పూలదండ వేయడు.. కనీసం లైటింగ్ ఏర్పాటు చేయడు.. అమర జ్యోతి ఇప్పటిదాకా ప్రజల కోసం ప్రారంభం కాలేదన్నారు. ఒకప్పుడు అంజయ్య పేరుతో ఉన్న పార్కు లుంబిని పార్క్ అయింది. అదే అంజయ్య పార్కు ఎదురుగా ఆయనను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని అన్నారు. గత పది సంవత్సరాలలో మేము ఏనాడు కూడా పేర్ల మార్పు పైన ఆలోచించలేదన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ, రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియం, రాజీవ్ రహదారి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్ని పేర్లు ఉన్నా వాటిని మేము ఏనాడు మార్చనికి ప్రయత్నం చేయలేదన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తుంది.. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే గాంధీభవన్లోనూ.. రేవంత్ రెడ్డి ఇంట్లోనూ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలని సూచించారు.

వందలాదిమంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుంది. మన పోరాటమే అస్తిత్వ పోరాటం.. ఆత్మ గౌరవ పోరాటం.. మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మన ప్రభుత్వం వస్తుందన్నారు. ఇప్పుడు పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి.. కాంగ్రెస్ పార్టీ కోరుకున్నచోటికి పంపిస్తామ‌న్నారు. ఈరోజు తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం తెలంగాణ మరిచిపోదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ప్రాంతీయంగా మహనీయుడి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతామ‌న్నారు. ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ విగ్రహాలు సరిపోయే అన్ని ఉన్నాయి. ఢిల్లీకి గులాములుగా ఉన్న మీకు.. తెలంగాణ పౌరుషం కలిగిన బిడ్డగా చెబుతున్నా.. వాటిని మార్చే దిశగా ఆలోచన చేస్తామ‌న్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story