ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన నాయకుడు ఎన్టీఆర్(NTR) అని మంత్రి కేటీఆర్(KTR) కొనియాడారు. ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ పార్క్(NTR Park) ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం నా అదృష్టం అని అన్నారు. భారతదేశంలో తెలుగువారు ఉన్నారు అంటూ చాటి చెప్పింది నందమూరి తారకరామారావు అని..
ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన నాయకుడు ఎన్టీఆర్(NTR) అని మంత్రి కేటీఆర్(KTR) కొనియాడారు. ఖమ్మం నగరంలో లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ పార్క్(NTR Park) ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం నా అదృష్టం అని అన్నారు. భారతదేశంలో తెలుగువారు ఉన్నారు అంటూ చాటి చెప్పింది నందమూరి తారకరామారావు అని.. దేశ వ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ అని కొనియాడారు.
తెలంగాణ వారికి అస్తిత్వం ఉంది.. తెలంగాణ వారికి పరిపాలన చేతనవుతుంది అని చూపిన వ్యక్తి కేసీఆర్(KCR) అని ప్రశంసించారు. చరిత్రలో ఎన్టీఆర్ స్థానం పదిలంగా ఉంటుందన్నారు. తారకరముడి ఆశీస్సులతో ఆయన శిష్యుడి గా కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్నారు.