మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి(Komatireddy Venkatreddy) మూసీ(Musi river) గురించి అవగాహన లేదు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి(Komatireddy Venkatreddy) మూసీ(Musi river) గురించి అవగాహన లేదు. ఆయనకి ఏం తెలువదని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారని..

మూసీపైన ఉన్న సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) లపై కూడా ఆయనకు అవగాహన లేదని కేటీఆర్‌ విమర్శించారు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళన అవుతాయన్నారు. ఇక మరో మంత్రి కొండా సురేఖపై కూడా కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మా పార్టీ తరపున కొండా సురేఖపై ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా అని ప్రశ్నించారు. కొండా సురేఖ గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలని.. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకని ఎద్దేవా చేశారు. గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపించాలా అని ప్రశ్నించారు. ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారని.. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్లు కూడా ఏడుస్తారు కదా అని కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తానని.. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలని ఎద్దేవా చేశారు.

Eha Tv

Eha Tv

Next Story