స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీలో చెప్పిన కే.టీ.ఆర్.

స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీలో చెప్పిన కే.టీ.ఆర్.

తెలంగాణ శాసన సభలో రైతు భరోసా పై జరుగుతున్న చర్చ సవాళ్లు , ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. ఒక వైపు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రుణ మాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి అంశాల పై గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడదాం.. మీ భాగోతం బయటపడుతుంది అంటూ సవాలు విసురారు.

ఇదే విషయం పై కే.టీ.ఆర్. కూడా ప్రతి సవాల్ విసిరారు. మీరు ఇచ్చిన రుణమాఫీ హామీ పూర్తి స్థాయిలో అమలు అయ్యిందని నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని అన్నారు. కొడంగల్, కొండారెడ్డి పల్లి, సిరిసిల్ల ఎక్కడికి పొదామో చెప్పండి.. ఎక్కడైనా వంద శాతం రుణ మాఫీ అయ్యిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు.

రైతు భరోసా పైన స్వల్పకాలిక చర్చ కాస్తా పక్క దారి పట్టి, అసెంబ్లీలో నేతల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. చర్చను సజావుగా సాగేలా చేయాలని హరీష్ రావు స్పీకర్ ను కోరారు. అటు మంత్రి, ఇటు తారక రామారావు ఇద్దరూ తగ్గకపోవడంతో అసలు విషయం పై చర్చ జరగకుండా.. ఇరువురి ఛాలెంజ్ లతో సభలో రసాభాస నెలకొంది.

ehatv

ehatv

Next Story