ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh), తెలంగాణలో(Telangana) ఇప్పుడు అరెస్టుల(Arrest) పర్వం కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh), తెలంగాణలో(Telangana) ఇప్పుడు అరెస్టుల(Arrest) పర్వం కొనసాగుతున్నాయి. సోషల్‌ మీడియా కార్యకర్తలపై(Social media Activist) కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి.

ఏపీలో వైసీపీ సోషల్‌(YSRCP) మీడియా కార్యకర్తలకు ప్రభుత్వం షాక్‌ ఇస్తోంది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. వైసీసీ కార్యకర్తలను, మద్దతుదారులపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 680 మంది నోటీసులు ఇచ్చారు. 147 కేసులు నమోదు చేశారు. 49 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టులను వైసీపీ ఖండిస్తోంది ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు అటు జగన్(YS Jagan), ఇటు కేటీఆర్‌(KTR) సవాళ్లు విసురుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, అరెస్టులు చేస్తున్న చంద్రబాబుపై(Chandrababu) జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడరని, నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారని జగన్‌ వార్నింగ్‌ ఇచ్చేశారు. నిలదీస్తే కేసులు పెట్టడం లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబుకు తెలుసని జగన్ ఆరోపించారు. చంద్రబాబూ నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ విషయంలో మొదటి ట్వీట్ చేస్తున్నానని, పార్టీ కార్యకర్తలందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దామని సవాలు విసిరారు. అరెస్టులంటూ జరిగితే తనతోనే జరగాలని జగన్‌ సవాల్‌ విసిరారు.

మరోవైపు తెలంగాణలో కూడా అరెస్టులు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా పలువురిపై కేసులు నమోదుచేస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి జైళ్లకు కూడా తరలించారు. ఇందులో పలువురు జర్నలిస్టులు(Journalist) కూడా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా కేటీఆర్‌ అరెస్టుపై రోజుకో విధంగా ప్రచారం జరుగుతోంది. రేవ్‌ పార్టీ(Rave party), డ్రగ్స్‌(Drugs) అంటూ కేటీఆర్‌ అరెస్ట్‌ అని ఒకసారి.. ఫోన్‌ ట్యాపింగ్(Phone tapping) అంటూ మరోసారి.. ఫార్ములా1 కేసులో కేటీఆర్‌ అరెస్ట్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. కేసులకు, అరెస్టులకు భయపడనని కేటీఆర్‌ పలు వేదికల్లో స్పష్టం చేస్తున్నారు. ఉడత ఊపులకు ఎవరూ భయపడేది లేదని కేటీఆర్ అంటున్నారు. ప్రజల కోసం వందల సార్లయినా జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమైనట్లు కేటీఆర్‌ అన్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ కేటీఆర్‌ ఘాటైన సవాల్‌ విసిరారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ అధినేత జగన్, బీఆర్‌ఎస్‌ అగ్రశ్రేణి నేత కేటీఆర్‌ సర్కార్‌కు సవాళ్లు విసురుతూ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story