మన్మోహన్ సింగ్ కు శాసనసభలో సంతాపం తెలుపుతూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది, నా దేశం మేల్కొని ఉంది అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఆయన గొప్పతనాన్ని గురించి వివరించారు కేటీఆర్ ఆయన లాయల్టీ ఉన్న నాయకుడు అధికారం లో ఉన్నపుడు, లేనపుడు ఒకవిధమైన నిబద్ధతతో పనిచేశారని కేటీఆర్ చెప్పారు.

కె.సి.ఆర్. తనకు కేటాయించిన షిప్పింగ్ శాఖను తమిళనాడు నాయకుల కోసం త్యాగం చేసినపుడు.. మన్మోహన్ సింగ్, కె.సి.ఆర్. ను కర్మయోగి గా పేరొందుతావని ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనను సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా అని ఆయనను పేర్కొనవచ్చు అని కె.టీ.ఆర్. అన్నారు.

మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రవేశానికి కారణమైన పి.వి.నరసింహ రావు గారికి దక్కకపోవడం కొంత బాధ కలిగించిందని కేటీఆర్ చెప్పారు. అందరూ ప్రధానులకు ఢిల్లీలో మెమోరియల్ ఉంది ఒక్క పి.వీ.కి మాత్రమే లేదని.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నుండి అందుకు సిఫారసు చేయాలని చెప్పారు. తెలుగు వాడు, తెలంగాణ వాడు అయినా పి.వీ. నరసింహ రావు కు ఆ గౌరవం ఖచ్చితంగా దక్కాలని కోరారు

కేటీఆర్

ehatv

ehatv

Next Story