సచివాలయంలో(Secreteriat) ప్రెస్‌మీట్‌లో(Pressmeet) సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ కేసీఆర్‌(KCR) 22 ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాలను కొని విజయవాడలో దాచాడని ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు ఓ అధికారి వచ్చి చెవిలో చెప్పారని ఆయన అన్నారు. దీనిపై ప్రముఖ ఎనలిస్ట్ ఎ.ఎస్.ప్రసాద్‌(KS Prasad) స్పందిస్తూ ఎక్కడైనా జీఏడీ అధికారులు చెవిలో చెప్తారా అని ప్రశ్నించారు. కొత్త కాన్వాయ్‌లు(Convoy) కొనడం ప్రభుత్వాలకు సర్వసాధారణమని ప్రసాద్‌ అన్నారు.

సచివాలయంలో(Secreteriat) ప్రెస్‌మీట్‌లో(Pressmeet) సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ కేసీఆర్‌(KCR) 22 ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాలను కొని విజయవాడలో దాచాడని ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు ఓ అధికారి వచ్చి చెవిలో చెప్పారని ఆయన అన్నారు. దీనిపై ప్రముఖ ఎనలిస్ట్ ఎ.ఎస్.ప్రసాద్‌(KS Prasad) స్పందిస్తూ ఎక్కడైనా జీఏడీ అధికారులు చెవిలో చెప్తారా అని ప్రశ్నించారు. కొత్త కాన్వాయ్‌లు(Convoy) కొనడం ప్రభుత్వాలకు సర్వసాధారణమని ప్రసాద్‌ అన్నారు. ఇప్పుడు ఉన్న కాన్వాయ్‌ల పనితీరును బట్టి కొత్త కాన్వాయ్‌ కోసం వాహనాలను కొనుగోలు చేయాలని జీఏడీ అధికారులు సూచిస్తారని.. దీంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్లు కొన్నారన్నారు. ప్రభుత్వ పరంగా కొన్న వాహనాలను(Vehicles) దాచి పెట్టారని సీఎం రేవంత్‌ అనడం.. ఆయన స్థాయికి సరికాదన్నారు. చాలా సింపుల్‌గా ఉంటున్నానని చెప్తున్న సీఎం రేవంత్.. ఆ వాహనాలను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచి అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో వేయాలని చెప్పారు. అలా చేస్తే రేవంత్‌ ప్రభుత్వం ఆదర్శంగా ఉంటుందని నమ్మకం కలుగుతుందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర అధికారులకు బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాలు కావాలని వాటిని వాడకుండా ఉంటారా అని ఎనలిస్ట్ ప్రసాద్‌ ప్రశ్నించారు. మరో అంశంపై స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ మన డబ్బులతో నిర్మించుకున్నామని.. ప్రాజెక్టుల డీపీఆర్‌లు, వాటికి సంబంధించిన అన్ని అనుమతులు కేంద్రమే ఇస్తుందన్నారు. ప్రాజెక్టులో సమస్యలు నెలకొంటే కేంద్రంతో చర్చించి ప్రభుత్వం పరిష్కరించుకోవాలని ప్రసాద్ సూచించారు.

Updated On 30 Dec 2023 9:58 PM GMT
Ehatv

Ehatv

Next Story