తెలంగాణలో రైతుబంధు(Rythubandhu) పడకపోవడానికి ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని ప్రముఖ ఎనలిస్ట్ కె.ఎస్.ప్రసాద్(KS Prasad) ఆరోపించారు. గతంలో రైతుబంధు వరుసగా 11సార్లు పడింది, ఎన్నికల కోడ్(Election Code) కారణంగా ఈ సారి ఆగిందన్నారు. రైతు బంధు రాకపోవడానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘానిదేనని ఆరోపించారు. ఎన్నికల సంఘం(Elections Commission) చర్యలకు నిరసనగా బుద్ధభవన్ ఎదుట రైతులు ధర్నా చేయాలని కె.ఎస్.ప్రసాద్ పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందు రైతుబంధు నిధులు జమచేసేందుకు గత ప్రభుత్వానికి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం, తీరా ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించిందన్నారు. నవంబర్ 30న ఎన్నికలు జరగగా.. డిసెంబర్ 3నాడు ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నాలుగు రోజులు ఎన్నికల సంఘం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలు, అధికారులు, పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలో ఉండగా రైతు బంధు నిధులు ఎందుకు విడుదల చేయలేకపోయిందని అడిగారు. రైతు బంధు ఆపే అధికారం ఉన్న ఎన్నికల సంఘానికి నిధుల విడుదల చేయడంలో ఉన్న అడ్డంకి ఎవరని ఆయన ప్రశ్నించారు. నవంబర్ 30న ఎన్నికలు అయిపోయిన వెంటనే నిధులు విడుదల చేసి ఉంటే ఈరోజు రైతుబంధు నిధుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి అవసరం లేదని.. రైతుబంధు కోసం రైతులు దీనంగా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.