పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. వృత్తి కంప్యూటర్(Computer) రంగం.. పృవృత్తి మత్తు పదార్థాల విక్రయం.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. వృత్తి కంప్యూటర్(Computer) రంగం.. పృవృత్తి మత్తు పదార్థాల విక్రయం. చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం(Software Engineers).. కానీ వాళ్లు వెలగబెడుతున్న అసలు విషయం మరోటి ఉంది. ఏకంగా తాము ఉంటున్న హాస్టల్‌లోనే(Hostel) ఈ అసాంఘిక కార్యక్రమాలకు తెగబడ్డారు. గంజాయి వ్యాపారం(Canabis) చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‌లో గంజాయి కలకలం సృష్టించింది. కెపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న నలుగురు యువకులు గంజాయి అమ్ముతుండగా బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గంజాయి సేవించడమే కాకుండా విక్రయిస్తున్న ఉద్యోగులు. వారి నుండి 1600 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఎక్కడి తీసుకొచ్చారు. ఎవరెవరికి విక్రాయించారు. ఎంత కాలం నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారన్నది నిందితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.