తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ భద్రాది కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని

Koneru Chinni who is leaving BJP
తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ భద్రాది కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని(Koneru Chinni) ప్రగతి భవన్(Pragathi Bhavan)లో సీఎం కేసీఆర్(CM KCR)ని కలిశారు. రాజకీయ భవిష్యత్‌పై సీఎం హామీ ఇవ్వడంతో కోనేరు చిన్ని బీజేపీని వీడనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు కోనేరు చిన్ని చేరికపై బీఆర్ఎస్(BRS) నేతలతో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే చిన్ని సీఎంను కలిశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రెస్‌మీట్ ద్వారా వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కోనేరు చిన్ని మాజీ మంత్రి దివంగత కోనేరు నాగేశ్వర్రావు(Koneru Nageshwarrao) తనయుడు. గతంలో వీరు టీడీపీలో ఉండగా.. ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అసలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి.. చిన్ని రాజీనామాతో మరింత బలహీనపడనుంది.
