సంక్రాంతికి(Sankranti) మొదలై ఉగాది(Ugadi) వరకూ జరగనున్న ఐనవోలు జాతరకు(Ainavolu Jathara) ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda surekha) తెలిపారు. ఐనవోలు జాతర ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆదివారం నాడు కలెక్టర్ సిక్తా పట్నాయక్(Sikta Patnaik), ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంక్రాంతికి(Sankranti) మొదలై ఉగాది(Ugadi) వరకూ జరగనున్న ఐనవోలు జాతరకు(Ainavolu Jathara) ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda surekha) తెలిపారు. ఐనవోలు జాతర ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆదివారం నాడు కలెక్టర్ సిక్తా పట్నాయక్(Sikta Patnaik), ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ..ఐనవోలు జాతర ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు(Piligrims) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మేడారం(Medaram), ఐనవోలు, కొమువెల్లి(Kommuvelli) జాతర నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఈ ఏడాది మేడారం మహాజాతర సవ్యంగా జరిగేలా గతంలో కంటే ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. మంత్రి సీతక్క(Sitakka), తాను ముందుండి పనిచేస్తామని అన్నారు. జాతర స్పెషల్ బస్సుల్లో(Special Bus) కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

Updated On 31 Dec 2023 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story