మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. కేటీఆర్ అమిత్ షాను కలిసిన తర్వాత కవిత కేసు ఆగిపోయిందని అన్నారు. కేటీఆర్ కి కొంత నాజెడ్జ్ ఉంది అనుకున్నా. ఈరోజు చిట్ చాట్ తర్వాత కేటీఆర్ కి ఏం తెలియదని అర్థమైందన్నారు.

మంత్రి కేటీఆర్(Minister KTR) పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) విరుచుకుప‌డ్డారు. కేటీఆర్(KTR) అమిత్ షా(Amit Shah)ను కలిసిన తర్వాత కవిత)Kavitha) కేసు ఆగిపోయిందని అన్నారు. కేటీఆర్ కి కొంత నాజెడ్జ్ ఉంది అనుకున్నా. ఈరోజు చిట్ చాట్ తర్వాత కేటీఆర్ కి ఏం తెలియదని అర్థమైందన్నారు. కేసీఆర్ కి దమ్ముంటే ఆయన్ని బండ భూతులు తిట్టిన దానం(Danam Nagendar), తలసాని(Talasani Srinivas Yadav) ని కేబినెట్ నుండి తీసేయాలని.. మీ పార్టీ నుండి తెలంగాణ ద్రోహులను తీసేయండని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర .1 ప‌ర్సెంట్ అని అన్నారు.

కేసీఆర్ 115 మందిని ప్రకటించి ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చి పంపారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. మేం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ అమెరికా(America)లో ఉన్నాడు.. చంద్రబాబు(Chandrababu) మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్(KCR) బయటకి వచ్చి పార్టీ పెట్టాడు.. రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy)ని ఎదిరించి మేం తెలంగాణ(Telangana) కోసం కొట్లాడినాం అని వివ‌రించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్ వినాలని సూచించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారు. సోనియా పాత్ర లేదని కేటీఆర్ అంటున్నాడు. పిల్లల మరణాలకు చలించి సోనియా తెలంగాణ ఇచ్చిందని.. సోనియా(Sonia Gandhi) పై కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కేటీఆర్ కి తగదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒకటవ తారీఖున పింఛన్లు వచ్చేవని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిందో చెప్పాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని విమ‌ర్శించారు.

దానం నాగేందర్ కట్టే పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను కొట్టాడని గుర్తుచేశారు. అరేయ్ కేసీఆర్ ఫుట్ బాల్ లాగా తంతాను అన్న తలసాని మంత్రి ఎలా అయ్యాడు? అని ప్ర‌శ్నించాడు. తెలంగాణ ద్రోహులను నీ పార్టీలో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? అని ప్ర‌శ్నించారు. పార్లమెంట్ లో కేసీఆర్ ఒక్కసారైనా తెలంగాణ కోసం మాట్లాడాడా? అని నిల‌దీశారు.

కేబినెట్ మంత్రుల్లో చాలా మంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళేన‌ని అన్నారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాకపోయేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్ కుటుంబం సోనియా ని ఎందుకు కలిశారు? ఎందుకు గ్రూప్ ఫోటో దిగారని ప్ర‌శ్నించారు.

తెలంగాణ ద్రోహులు, కేసీఆర్ ని తిట్టిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మీ తండ్రిని ఫుట్ బాల్ అడుతానని తిట్టినా వాళ్ళని కేబినెట్లో పెట్టుకోవడానికి సిగ్గులేదా? అని ప్ర‌శ్నించారు. మహమూద్ అలీ(Mohammad Ali), పద్మా దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) లను బానిసల‌లాగ చూసింది కేసీఆర్ అని అన్నారు. మంత్రులకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా? అని ప్రశ్నించారు. దట్టిలు కట్టడానికి తప్పా మహమూద్ అలీ దేనికి పనికిరాడ‌ని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ(Congress)లో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారని.. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్ష్(Himanshu) ముఖ్యమంత్రి అని అన్నారు. మా చెల్లిని అరెస్ట్ చేయకండి. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షా కి చెప్పి వచ్చాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల డిక్లరేషన్ ఏమయింది? అని ప్ర‌శ్నించారు. దళిత బంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నానని పేర్కొన్నారు.

Updated On 12 Sep 2023 8:44 PM GMT
Yagnik

Yagnik

Next Story