ఎల్బీ నగర్(LB nagar) నుంచి హయత్ నగర్(Hayath Nagar) వరకూ మెట్రో(Metro) పొడిగింపు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు(KCR) భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat reddy) లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్(అబ్దుల్లాపూర్‌మెట్) వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరం ఆవైపు వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. ఎంతోమంది ప్రజలు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి మెట్రోకు వెళ్తున్నారు.
ఎల్బీ నగర్(LB nagar) నుంచి హయత్ నగర్(Hayath Nagar) వరకూ మెట్రో(Metro) పొడిగింపు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు(KCR) భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat reddy) లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్(అబ్దుల్లాపూర్‌మెట్) వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరం ఆవైపు వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. ఎంతోమంది ప్రజలు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి మెట్రోకు వెళ్తున్నారు. ప్రయాణికులకు చాలా కష్టంగా ఉంటోందని వివరించారు. సాధారణ ప్రజలకు ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేవారికి చాలా అసౌకర్యం కలుగుతోందని వెల్లడించారు. ఈ లైన్ ను పొడిగించే యోచన ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. రోజురోజుకీ వాహనాల రద్దీ పెరుగుతోందని. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతోందని.. పైగా.. రోడ్ల నిర్వహణ సరిగ్గా ఉండడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
కేంద్రం ఈ మార్గంలోని జాతీయ రహదారి 65ను 6 లేన్లుగా మారుస్తోంది. రానున్న రోజుల్లోవాహనాల రద్దీ మరింత పెరుగుతుంది. అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్.. ఆ చుట్టుపక్కల ప్రజల ప్రయాణం మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంటుందని వెల్లడించారు. మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్ ఉందని.. ఈ మార్గంలో మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగానే ఉందని తెలిపారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ పురికి గతంలో లేఖ రాశాను. దీనిపై ఆయన స్పందించి రాష్ట్ర మున్సిపల్ శాఖకు ఫార్వార్డ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని లేఖలో కోరారు. కేంద్రానికి తాను రాసిన లేఖను, రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ నుంచి వచ్చిన లేఖను కూడా మీకు పంపుతున్నా.. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సీఎంను లేఖలో కోరారు.